Chinta Mohan: చంద్రబాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తప్పు.. బాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. రాహుల్ గాంధీ లాగా , చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబును 37 రోజులుగా జైలులో పెట్టడం తప్పు.. వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు… కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందన్నారు.. చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయా? అని నిలదీశారు. చంద్రబాబు పై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు.
Read Also: Earthquake: ఉత్తరఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు
Also Read
వాజ్ పాయ్, పీవీ నరసింహారావు కుట్రల ఫలితంగా అప్పట్లో అద్వానీపై కేసులు పెట్టారన్నారు చింతా మోహన్.. దాని ఫలితంగా అద్వానీ ప్రధాని కాలేక పోయారన్నారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశరాఉ.. తెలంగాణలో 75 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఇక, తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.. కాంగ్రెస్ తో జతకట్టిన పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ- జనసేన పొత్తును ఆహ్వానిస్తున్నాం అన్నారు. 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు ఏపీలో కాంగ్రెస్ కు పెరిగిందన్నారు. మా పార్టీతో కలసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ 2005లో రాజ్యంగ సవరణ ద్వారా చట్టం చేసి 27శాతం ఓబీసీ లకు రిజర్వేషన్లు ఇచ్చింది.. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదన్నారు. రాజకీయంగా కూడా అన్ని రాజకీయ పక్షాలు ఓబీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!