ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు.
టీడీపీ నాయకులు మరో కొత్త డ్రామాకు తెర లేపారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని, ప్రాణాలకు ప్రమాదం ఉందని ప్రచారం మొదలు పెట్టారని ఆయన అన్నారు.
వైసీపీకి నెల్లూరు జిల్లా పెట్టని కోటగా నిలిచిందని, ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదు, ఏ ఒక్కరిని పార్టీ వదులుకోదని, జిల్లాలో పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉందని దక్షిణ కోస్తా జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.