Botsa Satyanarayana: కేవలం స్టడీ కోసమే ఒప్పందం.. రూ.4 వేల కోట్ల స్కాం ఏంటీ..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐబీ ఒప్పందాన్ని తప్పుబడుతోన్న జనసేన పార్టీ.. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.. అయితే, విద్యారంగంపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సెలిబ్రిటీ పార్టీ (జనసేన) మళ్లీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐబీ ఒప్పందంపై మళ్లీ విమర్శలు చేస్తున్నారు. ఐబీ ఒప్పందంలో ఏదో స్కాం జరిగిందనే ఆరోపణలు చేశారు. ఫైనాన్స్, న్యాయ విభాగాలు అభ్యంతరం తెలిపినా ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అసలు పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనా..? ఆ సెలిబ్రిటీ పార్టీ ఉద్దేశ్యం అంటూ నిలదీశారు.. ఐబీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫైనాన్షియల్ కమిట్‌మెంట్ ఎక్కడుందో చెప్పాలన్న ఆయన.. కేవలం ఇంటర్నేషనల్ కరిక్యులమ్ కోసం స్టడీ చేయడమే ఒప్పందంలో ఉన్న సారాంశం.. కేవలం స్టడీ చేయడం కోసమే ఒప్పందం చేసుకుంటే.. రూ. 4 వేల కోట్ల స్కాం ఏంటీ..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రాధాన్యతాంశంలో విద్యా రంగం ప్రధానమైందని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చాం. ఇటీవల కాలంలో కొందరు విద్యా రంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు అందిస్తుంటే బురద జల్లుతున్నారన్న ఆయన.. ఎన్నిసార్లు చెప్పినా అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు టోఫెల్ విషయంలో శిక్షణ ఇస్తామన్నాం. టోఫెల్ విషయంలో విమర్శలు చేశారు. విద్యారంగంపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియకుండా విమర్శలు చేస్తున్నారన్నారు.. టోఫెల్ కోసం కేవలం ఐదేళ్లకు రూ. 145 కోట్లే ఖర్చు అవుతోంది. ఇంగ్లీష్ భాష మీద గ్రిప్.. యాక్సెంట్ కోసమే టోఫెల్‌లో శిక్షణ అని స్పష్టం చేశారు. పేదవాడి కొడుకు పేదవాడిగానే ఉండాలా..? అని మండిపడ్డారు బొత్స.
Also Read
ఇక, ఐబీ ఒప్పందం కేబినెట్‌లో చర్చించే చేశాం అన్నారు మంత్రి బొత్స.. మేమే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఐబీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్యాబులైనా, బైజూస్ కంటెంటైనా, టోఫెల్ శిక్షణతో ఒప్పందమైనా, ఐబీతో ఎంవోయూ అయినా కేబినెట్‌లో చర్చించే నిర్ణయించాం అన్నారు. ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదు.. ప్రభుత్వ విధానం అన్నారు. ఐబీతో ఒప్పందం విషయంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు.. వాళ్లు ఉచితంగానే స్టడీ చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. టోఫెల్, ఐబీ ఒప్పందం విషయాల్లో టెండర్లు పిలవనవసరం లేదని మేం నిర్ణయించుకున్నాం. ఆ ఒప్పందాలు కుదుర్చుకునే అంశంలో టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మేం భావించాం. ఈ ఒప్పందాల్లో సరఫరా చేసే అంశాలేవీ లేవన్నారు మంత్రి బొత్స సత్యనారాణ.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!