పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలు మార్చారా? అంటూ ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఈసీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండవారిపల్లె వాసులు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.. నల్గొండవారి పల్లెలో ఎలా దాడులు చేశారో మనం చూశాం.. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్చడం చూశాం.. కానీ, పోలింగ్ కేంద్రం ఉన్న మార్చారు.. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి మార్చారా..?…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ ఎట్డకేలకు జైలు నుండి విడుదలయ్యారు. ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కిషోర్.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. ఇప్పటికే కిషోర్ పై 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో రెంటచింతల పోలీసులు కిషోర్ ను పీటీ వారెంట్ పై అరెస్టు చేశారు.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు..
కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్ భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు.
కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.