పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా, వైఎస్ జగన్‌కు దగ్గరివాడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం సంచలనమైంది.. వైసీపీకి మాత్రమే రాజీనామా చేయడం కాదు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు సాయిరెడ్డి.. అయితే, కొన్ని రోజుల తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తారనే ప్రచారం సాగుతూ వస్తోంది.. కొన్నిసార్లు ఆయన ఖండించినా.. ఈ వ్యవహారానికి తెరపడటంలేదు.. అసలు సాయిరెడ్డి రీ ఎంట్రీలో నిజమెంతా?
వైఎస్ జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కృష్ణాజిల్లా గుడివాడ.. గుడ్లవల్లేరులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు.. మామిడికాయలకు.. తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అంటూ సెటైర్లు వేశారు.
మూడేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నాం.. ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోం.. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను.. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం అన్నారు వైఎస్ జగన్..
ఏపీ రాజధాని అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులతో సమావేశమైన ఆయన.. అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోందని ఆరోపించారు.. చదరపు అడుగకు 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి.. అమరావతిలో చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు చేస్తున్నారు.
Minister Satya Kumar: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్నదానికి రుజువులు చూపించగలవా జగన్.. మీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు.
Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది.