వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు.
కోటగిరి శ్రీధర్... వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా.... అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం.
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా, వైఎస్ జగన్కు దగ్గరివాడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం సంచలనమైంది.. వైసీపీకి మాత్రమే రాజీనామా చేయడం కాదు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు సాయిరెడ్డి.. అయితే, కొన్ని రోజుల తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తారనే ప్రచారం సాగుతూ వస్తోంది.. కొన్నిసార్లు ఆయన ఖండించినా.. ఈ వ్యవహారానికి తెరపడటంలేదు.. అసలు సాయిరెడ్డి రీ ఎంట్రీలో నిజమెంతా?