కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు..
Pulivendula Elections: వైస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ నేడు విజయవాడలో పులివెందులలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడన్నారు. అలాగే దీన్ని ఏమైనా ఎన్నిక విధానం అంటారా చంద్రబాబు అంటూ.. అసలు ఏమైనా ఆలోచన ఉందా అంటూ రెచ్చిపోయారు. ఇంకా ఆ ప్రాంతంలో ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు. Liquor Scam:…
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్ జగన్ కేబినెట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా? అనే చర్చ సాగుతోంది..
వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం... వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసిన అక్కడ ఏకగ్రీవమే.. అయితే, 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500…
CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు.
Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
అధికార పార్టీకి విపరీతమైన పట్టున ఆ నియోజకవర్గంలో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందా? అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు కేడర్ డైలమాలో పడిందా? ఆగండి... రా.. రండని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుస్తున్నా... పట్టించుకునే స్థితిలో ద్వితీయ శ్రేణి లేదా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి?
వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.