ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన దుష్ప్రచారమని ఆయన విమర్శించారు.
ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంభందాన్ని గుర్తుకు తెచ్చినట్లేనని ఆ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు..
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష…
కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ... కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు..