Nallapareddy Prasanna Kumar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు.. చంద్రబాబుకి పూర్తిగా మతిభ్రమించింది.. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి పొత్తులు పెట్టుకొనేతత్వం చంద్రబాబుదన్న ఆయన.. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న చంద్రబాబు నైజం దేశానికి తెలుసన్నారు. ముఖ్యమంత్రి కూర్చుని లాక్కొన్నప్పటి నుంచి ఒంటరిగా ఎన్నికల లో పోటీ చేయలేదని విమర్శించారు.
Read Also: Namrata Shirodkar: మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్
సీఎం జగన్ గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పిల్లి అంట.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింహం.. సింహం కడుపులో సింహం పుడుతుంది తప్ప. పిల్లి పుట్టదు కదా..? అని ప్రశ్నించారు నల్లపరెడ్డి.. సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు సరికావని హితవుపలికారు. జూబ్లీహిల్స్ నక్కవని.. కుప్పం కుక్క వని.. భారతదేశంలో మాఫియా గ్యాంగ్ లీడర్ అని.. రాజకీయ వ్యభిచారి అని నేను కూడా తిట్టొచ్చు.. కానీ, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అడ్డు వస్తోందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోవాలని హితబోధ చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..