AP land titling Act: భూ వివాదాలు లేకుండా చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP land titling Act: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తుందన్నారు రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సర్వే పూర్తి అయిన తర్వాత నోటిఫైడ్ చేస్తాం. స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన అభిప్రాయాలను తీసుకొని రూల్స్ తెస్తాం అన్నారు. ఇది వరకే పలు పిల్స్ హైకోర్టులో పడ్డాయి. హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ కూడా అమలు చేస్తాం అన్నారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం. రెవిన్యూ అధికార వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని ఇలాగే వుండిపోతే ఎలా ? అని ప్రశ్నించారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని ఉపయెగించుకొని సమగ్రంగా సర్వే చేస్తాం అని ప్రకటించారు. ఈ చట్టం పై ఆరోపణలు చేస్తున్నవారు.. చట్టాన్ని ఎందుకు తెస్తున్నామో తెలుసుకోవాలని సూచించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 14 శాతం హత్యలు, 60 శాతం నేరాలు కేవలం భూ వివాదాల వల్లే జరుగుతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు..
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
కాగా, ఏపీ భూ హక్కుల చట్టం (AP land titling Act 2023) అమల్లోకి వచ్చింది. ఏపీ భూహక్కుల చట్టం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో ఏపీ భూహక్కుల చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని భూములను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పనిసరి చేసింది మరియు ప్రస్తుతం దాని అన్ని జిల్లాల్లో రీసర్వేలు చేపడుతోంది. స్థిరాస్తులకు శాశ్వత హక్కు కల్పించేందుకు మరియు మరింత సమర్థవంతమైన వివాద పరిష్కారానికి కొత్త వ్యవస్థను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ చర్యలో ఈ ప్రయత్నాలు భాగమే. ఈ చట్టం అమలుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), న్యాయవాదులు మరియు ఇతర కార్యకర్తల నుండి విస్తృత విమర్శలు వచ్చాయి. వాస్తవానికి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ చట్టం కీలక ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!