YSRCP: ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇప్పటికే రెండు లిస్ట్‌లు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితా కూడా సిద్ధం చేసింది.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రెండు జాబితాలతో ఇప్పటికే ఈ సారి నో టికెట్ అని తేల్చేసింది.. మరికొందరి స్థానాలు మార్చేసింది.. ఇదే సమయంలో.. ఒంగోలు ఎంపీ సీటుపై ఎవరికి? అనే చర్చ సాగుతూ వచ్చింది.. ఈ సారికి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు ఇచ్చే అవకాశం లేదనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఆయన టీడీపీవైపు చూస్తున్నారని.. వైసీపీ టికెట్ రాకుంటే.. ఫ్యాన్ కింద నుంచి జరిగి.. సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగింది.. అయితే, ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అనిశ్చితి తొలగినట్లు సమాచారం..
Read Also: Shiva Stotram: ఈ స్తోత్రాలు వింటే ప్రస్తుత, పూర్వ జన్మ పాపముల నుండి విముక్తి
విజయవాడలో సోమవారం అర్ధరాత్రి వరకు ఎంపీ మాగుంట, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధి సమావేశం అయ్యారు.. రెండు గంటల పాటు మాగుంట, బాలినేనితో ఐ ప్యాక్ సుదీర్ఘ మంతనాలు సాగించింది. చర్చల్లో పలు కీలక అంశాలు కొలిక్కివచ్చాయట.. మొత్తంగా ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. మాగుంట విషయంలో ఆదినుంచి పట్టుపడుతూ వచ్చిన బాలినేని.. మొత్తంగా అందరినీ ఒప్పించగలిగారట.. పలువురు నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, చేర్పుల విషయంలో కూడా పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం.. అన్నీ పూర్తయితే ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండేపి, అద్దంకి మార్పులు పూర్తి కాగా.. మరో రెండు నియోజకవర్గాల్లో కసరత్తులు పూర్తి చేసింది వైసీపీ అధిష్టానం.. మిగతా చోట్ల కూడా ఓ క్లారిటీకి వచ్చారట వైసీపీ అధిష్టానం పెద్దలు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమావేశం కానుండగా.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు.