Daggubati Purandeswari: అందుకే ప్రధాని మోడీని సీఎం జగన్.. హోంమంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: ఏపీలో ఎన్నికల పొత్తులపై వాడివేడీగా చర్చలు సాగుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగడం ఆసక్తికరంగా మారింది.. ఈ పర్యటనలో ఏం చర్చలు జరిగాయి అనేది పక్కన పెడ్డితే.. ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కలిశారని.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. అయితే, ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు.
మరోవైపు.. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని తెలిపారు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది అని ఆరోపించారు పురంధేశ్వరి.. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది.. నిధుల వినియోగంపై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారని తెలిపారు. మరోవైపు, తిరుపతి ఉప ఎన్నికల్లో వై.సి.పి. నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చించారని.. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ.. పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు.. దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ఇక, రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదన్నారు. సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది.. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమా ని ప్రభుత్వం చెల్లించలేదు.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయి. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది.. అందుకే 370 ఆర్టికల్ రద్దు.. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.. ప్యాకేజి బాగుందని కూడా చెప్పారు.. అందుకే అప్పుడు వెంకయ్య నాయుడుకు కూడా సన్మానం చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!