Jagan Ane Nenu Countdown: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి.. ఓవైపు సిద్ధం పేరుతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తుండగా.. మరోవైపు ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ.. వైసీపీపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడం.. సీట్లపై కూడా క్లారిటీ రావడంతో.. ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, గత ఎన్నికల సమయంలో.. ప్రచారంలో తన మార్క్ చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్.. విస్తృతంగా నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చింది.. అప్పట్లో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయం ముందు ‘బైబై బాబు..’ అంటూ కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేశారు.. రాష్ట్రంలోని ఇతర వైసీపీ ఆఫీసుల వద్ద కూడా ఇది దర్శనం ఇచ్చాయి..
Read Also: Congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. కమల్‌నాథ్‌కు ఉపశమనం
అయితే, ఈ సారి ప్రచారంలో తన పంతాను మార్చింది వైసీపీ.. రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ కొలువుదీరి ఐదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో.. మళ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది.. గతంలో 151 సీట్లలో విజయంతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ఇప్పుడు వైనాట్ 175 పేరుతో ప్రచారం చేస్తోంది.. అంతేకాదు.. వైనాట్ కుప్పం అంటూ సీఎం జగన్ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి చేకూరింది.. లబ్ధి జరిగితేనే ఓటు వేయాలని కోరుతున్నారు సీఎం జగన్.. ఎన్ని పార్టీలు జత కట్టినా.. టీడీపీ-జనసేన-బీజేపీ గుంపుగా వచ్చినా.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. మరో సారి అధికారంలోకి వైసీపీ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇదేసమయంలో.. గతంలో బైబై పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ”జగన్ అనే నేను” పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్‌లు ఏర్పాటు చేశారు..
Read Also: Odisha: ఎన్నికల వేళ మహిళా ఉద్యోగులకు నవీన్ సర్కార్ గుడ్‌న్యూస్
ఈ కొత్త కౌంట్‌డౌన్ క్లాక్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌తోపాటు ఆ పార్టీ నేతలు “జగన్ అనే నేను” పేరుతో ఏర్పాటు చేసిన కౌంట్‌డౌన్ క్లాక్ బోర్డును ఆవిష్కరించారు. ఆ కౌంట్‌డౌన్ క్లాక్ ప్రకారం.. మరో 73 రోజుల్లో వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందనే విధంగా క్లాక్ కౌంట్‌డౌన్ కొనసాగుతోంది.. ఇక, ‘జగన్ అనే నేను..’ అంటే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ఆ కౌంట్‌డౌన్ క్లాక్‌తో చెప్పకే చెబుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.