Geetanjali Suicide Case: ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే.. గీతాంజలి కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించారు సీఎం జగన్.. అంతేకాదు గీతాంజలి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు.. ఇక, గీతాంజలి పసిబిడ్డల కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం జగన్.. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్.
Read Also: AP DSC New Schedule 2024: డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
అయితే, టీడీపీ, జనసేన వేధింపుల కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇక, గీతాంజలి మరణ వార్తను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారాయన.. ఆర్థిక సాయంగా 20 లక్షల రూపాయలు అందించనున్నట్టు ప్రకటించారు.. ఇక, ఆమె చనిపోయేలా ప్రేరేపించిన వారి పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని.. వారినిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.. మరోవైపు.. ఈ రోజు వైసీపీ నాయకులతో కలిసి తెనాలిలోని గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు..
Read Also: Athadu Vs Jalsa: ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు
కాగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా గ్రూపుల వేధింపుల వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంతో తెనాలికి చెందిన మహిళ ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. యూట్యూబ్ ఛానెల్‌లో గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.