Geetanjali Suicide Case: తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా పోస్టుల వల్లే.. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్టు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారం సీఎం వైఎస్ జగన్ వరకు వెళ్లింది.. మహిళల గౌరవానికి భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసిన సీఎం జగన్.. గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు.. తన భార్య గీతాంజలి మృతిపై కీలక విషయాలను వెల్లడించారు ఆమె భర్త బాలచందర్.
జగనన్న కాలనీలో ఇల్లు పట్టా తీసుకున్నాం.. ప్రభుత్వానికి మద్దతుగా నా భార్య కామెంట్లు చేసింది.. అక్కడి నుంచి సోషల్ మీడియాలో మాకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు బాలచందర్.. అసభ్య పదజాలంతో టోల్స్ రావడంతో నా భార్య తీవ్ర ఆవేదన చెందింది.. మేం పనుల నిమిత్తం బయటికి వెళ్లిపోయాం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లతో నా భార్య గీతాంజలి మరింత కలత చెందింది.. అర్ధరాత్రి కూడా ఫోన్ చూసుకొని బాధపడేది అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇక, ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ కి వెళ్లి గీతాంజలి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం.. అయినా ప్రయోజనం లేకుండా ప ఓయింది.. ట్రోల్స్ వల్లే నా భార్య ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయం తెలుసుకొని నిర్ధాంత పోయానన్న బాలచందర్.. మాకు ఎప్పుడూ సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెట్టే అలవాటు లేదు.. కానీ, మా మీద మాత్రం కామెంట్లు పెట్టారు.. అది చూసి నా భార్య తీవ్ర ఆవేదన చెందింది.. అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు గీతాంజలి భర్త బాలచందర్.