నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్‌కి చేరుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే,…
మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. 'అన్నదాత పోరు' పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తరువాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్టు అయ్యింది.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు..
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..