అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు..
పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర.. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్‌కు అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలు కనడుతున్నాయా? అని ప్రశ్నించారు..
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా 2024లో వైసీపీ ఓటమికి చాలా రీజన్సే ఉన్నాయి. 40 శాతం ఓట్లు ఉన్నా... ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక 11కే పరిమితం అయింది. పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చినా...వెంటనే తేరుకున్న అధ్యక్షుడు జగన్... తిరిగి ట్రాక్ ఎక్కించే పని మొదలుపెట్టారు. రకరకాల స్టేట్మెంట్స్, కార్యక్రమాలతో... ఫస్ట్ కేడర్‌లో ధైర్యం నింపగలిగారు.
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వాములైనా... ఫీల్డ్‌లో ఫ్రంట్ లైన్లో కనిపించడం లేదు జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది. దీంతో అసలు అలా ఎందుకు జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆరా తీయడం మొదలైపోయింది. యూరియా కొరతలాంటి రైతు సమస్యలు, ప్రజల ఇతర ఇబ్బందులు, కూటమి పార్టీల హామీల అమలు లాంటి అంశాల్లో... వైసీపీ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తోంది.
ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం, వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్ వల్ల మనకు భవిష్యత్ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలి, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి, ఇక ఏ మాత్రం జాప్యం తగదు. జగన్ ఆలోచనలు, విధానాలను మీమీ బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలి. అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఐదేళ్ళలో మనం ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్థమవుతోందన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.
ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంటర్ జైల్లో సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి..
వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.