మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. 'అన్నదాత పోరు' పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తరువాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్టు అయ్యింది.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు..
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గణేష్ మండపం పక్కన చికెన్ భోజనాలు ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 30 మందిపై కేసు నమోదు చేశారు నందిగామ పోలీసులు.
యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు..
తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని.. పోలీస్ భద్రత కల్పించాలంటూ జిల్లా ఎస్పీ జగదీష్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని.. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని కోరినట్లు సమాచారం.
టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లినవారు.. మళ్లీ తిరిగి వస్తారని తెలిపారు కాసు.. మీరు గ్రామం దాటించారని.. రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.. తెగించే వరకూ తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని హెచ్చరించారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని విరుచుకుపడ్డారు.. సిట్ అధికారులు మీ ఇంటికొస్తే సాష్టాంగంగా వారి కాళ్లపై పడిపోయావు.. దీనికన్నా గలీజ్ ఏమైనా ఉందా? అని ఫైర్ అయ్యారు..