Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం…
వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది... నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది.
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దారెటు..? ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలీస్ ఆంక్షల కారణంగా... సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లలేరు. 14 నెలల నుంచి ఆయన టౌన్లోకి రాకుండా ఇటు జేసీ ప్రభాకర్రెడ్డి, అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానంటూ తన సైన్యాన్ని సిద్ధం చేస్తారు జేసీ. నువ్వు అటు వైపు చూసినా... లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు పోలీసులు. దీంతో... సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా…
అంతా శాఖాహారులే..... కానీ... బుట్టలోని రొయ్యలు మాత్రం మాయం. ప్రస్తుతం రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటికి వచ్చిన నేతలంతా... మాకు సంబంధం లేదంటే మాకు లేదంటున్నారు. కానీ... పెరోల్ మాత్రం వచ్చింది, రచ్చ అయ్యాక మళ్లీ శ్రీకాంత్ని లోపలికి నెట్టారు. కానీ.. ఇక్కడ అసలు దోషులెవరన్నది బిగ్ క్వశ్చన్. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న, అంతకు ముందు కూడా…
శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసిన రమేష్ అలియాస్ మాస్ పుష్పను అరెస్ట్ చేశారు పోలీసులు.. నా మానసిక స్థితి బాగోలేక అలా చెప్పాను.. మద్యం మత్తులో మాట్లాడాను.. మా అమ్మకి వితంతు పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే అయినా.. పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశాను అంటున్నాడు రమేష్.. అంతే కానీ, నాకు చంద్రబాబు మీద , పవన్ కల్యాణ్ పై ఎలాంటి కక్ష లేదంటున్నాడు..