బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగుతోంది.
నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు.
బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.