శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ కేంధ్రమంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటువంటి రోజు వస్తుందని నేను ఏరోజు అనుకొలేదు.. కాంగ్రెస్ లో కేంద్రమంత్రి స్థాయికి ఎదిగాను.. అమ్మ ఒడి నుంచి జారి పడి తమ్ముడు జగన్ వద్దకు చేరుకున్నాను.. 2019లో పార్టీ సీటు ఇస్తామని విజయసాయి రెడ్డి నాడు హామీ ఇచ్చారు.. అప్పుడు ఏం బాధపడలేదు.. సీఎం నన్ను చాలా అప్యాయంగా మాట్లాడారు.. నాకు తమ్ముడు సీఎంగా ఉన్నాడు ఈ అక్కను ఆదుకుంటారని భావించాను.. కానీ, రాజకీయాలలో పదవైనా, గౌరవమైనా కోరుకుంటారు అని ఆమె తెలిపారు. నా పెద్దన్న కొడుకని నేను సీఎం జగన్ ను నమ్మాను.. నాకు పార్టీ అధ్యక్షురాలిగా ఎందుకు పదవి ఇచ్చారో.. ఎందుకు తీసారో కూడా తెలియదు అని కిల్లి కృపారాణి అన్నారు.
Read Also: Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!
పార్టీ కోసం ఐదున్నరేండ్లు కార్యకర్తగా పని చేశాను అని కిల్లి కృపారాణి అన్నారు. జగన్ మొహాన్ రెడ్డిని నమ్మి పార్టీలోకి వస్తే నాకు పార్టీలో అవమానం చేశారంటూ ఆమె కన్నీళ్లు పర్యాంతమైంది. నీకు స్థానం, గౌరవం లేదన్న చోట బాధను భరించలేకపోయాను.. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నా వెనుకున్న వారికి ఏం చేయలేకపోతున్నాని ఆవేదనతో నాడు పార్టీ మారాను అని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో ఉండాలంటే తిట్లు, దూషణలు రావాలా అని ప్రశ్నించారు. నయ వంచనకు ఏం పేరు పెట్టాలి.. నాకు పదవి రాలేదని కాదు.. గౌరవం కావాలన్నారు. ఏపీలో విద్యావంతులైన మహిళలు, ప్రజలు గుర్తించాలి.. సీఎం జిల్లా వస్తే హెలిప్యాడ్ కు రాకుండా అడ్డుకుని అవమానించారు.. కొద్ది మంది నేతలు కిల్లి కృపారాణిని అణచివేయాలని వైసీపీలో భావించారు. దాన్ని తట్టుకోలేకపోయాను.. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అన్ని పార్టిల నుంచి నాకు అహ్వానం ఉంది.. నేను రానున్న ఎన్నికలలో పోటీ చేస్తాను అని కిల్లి కృపారాణి వెల్లడించింది.