Budi Mutyala Naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి.. తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు అభ్యర్థులు.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ.. ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తున్నారు.. అయితే, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగనున్న సీఎం రమేష్‌పై హాట్ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ను కడపకు పార్సిల్ చేయడానికే నన్ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు.. స్థానికేతరులను, డబ్బు సంచులు తెచ్చే అభ్యర్థులను.. అనకాపల్లి ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడిస్తారని తెలిపారు. నిన్నటి వరకు సీఎం రమేష్ కు అనకాపల్లి ఎక్కడుందో తెలియదు.. ఆ అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇక, సీఎం రమేష్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారస్తుడు.. పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడమే అతని పని అంటూ ఆరోపణలు గుప్పించారు ఏపీ డిప్యూటీ సీఎం, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు.
Read Also: Rajiv Gandhi Case: 3 దశాబ్దాల తర్వాత నిందితులకు వీడ్కోలు