మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది.. సోమవారం రోజు సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మానుపల్లెలోని విడిది కేంద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్‌సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.