అక్కా చెల్లెమ్మలు మేలు చేసే మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు , అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న 'మేమంతా సిద్ధం' సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్ర గాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, అధికార వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ అయ్యారు.
నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' సభలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని.. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని సీఎం అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు.... ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించారు.. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్ర బాబు దోచుకున్నారు అని ఆరోపించారు.