ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుఅవుతారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది..
ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
Off The Record: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు గురించి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో డిఫరెంట్ చర్చ జరుగుతోంది. ఇందులో భాస్కర్ రెడ్డి ఏ 38గా, ఆయన కుమారుడు ఏ 39 గా ఉన్నారు. మద్యం ముడుపుల డబ్బుని ఎన్నికల సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడంతోపాటు మరికొన్ని వ్యవహారాల్లో చెవిరెడ్డి కీలకపాత్ర పోషించినట్టు ఇప్పటికే చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిట్.…
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట గట్టిగా పాడింది వైసీపీ. కానీ... శృతి కుదరక మొదటికే మోసం వచ్చింది. గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తత్వం బోధపడి ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు తాము బాగా ప్రేమించిన విశాఖ వాసులు రాజధానిని ఓన్ చేసుకోలేకపోయారు, ఇటు కర్నూలు జిల్లా వాసులు అంతగా రియాక్ట్ అవలేదు.
Off The Record: ఐఏఎస్ అధికారి గిరిషా పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్‌లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన పీఎస్ గిరిషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక…
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. వచ్చే సంక్రాంతి తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు దశల వారీగా జరుగుతాయి. ఇప్పటిదాకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బ్యాలెట్ పద్ధతిలోనే జరగ్గా… తొలిసారి ఈవీఎంల వినియోగం గురించి ఆలోచిస్తోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృ చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం 80 శాతం స్థానిక సంస్థలు వైసీపీ చేతిలోనే ఉండడంతో వీలైనంత త్వరగా.. ఎన్నికలు జరిపి…
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి కింద పడిపోయిన భాస్కర్ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే భాస్కర్ రెడ్డి మృతిచెందినట్టుగా నిర్ధారించారు.