Off The Record: ఆ ఐఏఎస్‌కు క్లీన్ చిట్.. వైసీపీలో అలజడి రేపుతుందా..?
- తిరుపతి దొంగ ఓటర్ కార్డుల కేసులో ఐఎఎస్ గిరిషాకు క్లీన్‌చిట్..
- ఆయన ప్రమేయం లేదని నివేదిక, చర్యల నిలిపివేత..
- అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి నాయకులు..
- చర్యల నిలిపివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చ..
- పార్టీ నాయకులు లోతుగా అర్ధం చేసుకోలేకపోతున్నారా?..
- క్లీన్‌చిట్‌పై టీడీపీ నాయకుల ఘాటు వ్యాఖ్యలు..
- గిరిషాకు మాత్రమే క్లీన్‌చిట్, కేసు అలాగే ఉందంటున్న పెద్దలు..
- కేసులో ఉన్న రాజకీయ నేతలు జైలుకెళ్తారంటున్న టీడీపీ..
- అప్పుడు జరిగిన తప్పుల గురించి గిరిషా పూర్తిగా చెప్పేస్తారా?..
- గిరిషాకు క్లీన్‌చిట్ వైసీపీలో అలజడి రేపుతోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఐఏఎస్ అధికారి గిరిషా పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్‌లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్‌చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన పీఎస్ గిరిషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారట విచారణాధికారి. దీంతో ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసింది కూటమి సర్కార్. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, నేతల్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్లో ఓటరు కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారంటూ.. వైసిపిపై చంద్రబాబు సహా… కూటమి నేతలంతా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అలాంటిది… అప్పుడు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆఫీసర్ మీద చర్యలను నిలిపివేయడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2021లో జరిగిన తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికలో ఓటరు కార్డుల అక్రమంగా డౌన్‌లోడింగ్ కేసులో సస్పెండ్ అయ్యారు గిరిషా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో తొలుత గిరీషా సస్పెండ్ అయ్యారు. తర్వాత వరుసగా పలువురు కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల మీద సైతం వేటు పడింది.
Read Also: Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
మరోవైపు పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే ఐఎఎస్ మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా జిల్లాలో చర్చనీయాంశం అయింది. విచారణ సమయంలో సాంకేతిక ఆధారాలతో సంజాయిషీ ఇచ్చారట గిరీషా. అప్పటికే లోతుగా విచారించిన ఈసీ సైతం ఈ సంజాయిషీతో సంతృప్తి చెంది సస్పెన్షన్ ఎత్తేసినట్టు చెప్పుకుంటున్నారు. అటు కూటమి ప్రభుత్వం నియమించిన అధికారి కూడా… క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి… దొంగ ఓటరు కార్డుల వ్యవహారంలో గిరిషా పాత్ర లేదని తేల్చడంతో… ప్రభుత్వ పరంగా కూడా తదుపరి చర్యలను నిలిపేసినట్టు తెలిసింది. అయితే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోలేని కూటమి నేతలు కొందరు…అనుమానపడుతున్నారట. తిరుపతి కూటమి నేతలైతే… ఒక అడుగు ముందుకేసి అప్పట్లో ఈ విషయమై…. మనం గట్టిగానే పోరాడాం…. అలాంటిది ఇప్పుడు ఉపశమనం ఎలా ఇస్తారు అంటూ బహిరంగంగానే చర్చలు పెట్టారట. కొందరైతే… సోషల్ మీడియాలో ఘాటు కామెంట్స్ పెడుతున్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో భూమన కుటుంబం పాత్ర ఉందని చెప్పాం… అలాంటిది ఇప్పుడు మేమేం సమాధానం చెప్పాలంటూ కొందరు టీడీపీ సీనియర్స్ ఫీలైపోతున్నారట. దాంతో కంగారుపడ్డ పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
గిరిషాకు క్లీన్‌చిట్ ఇచ్చినంత మాత్రాన కేసు ఎక్కడికి పోలేదని, అది కొనసాగుతుందని, అక్రమంగా ఓటర్ కార్డుల డౌన్‌లోడ్ వెనక వైసిపి నేతలే ఉన్నారన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుందని అంటున్నారట. ఈ కేసులో భూమన కుమారుడు అభినయ్ పాత్ర ఉందని టిడిపి సీనియర్ నేత పట్టాభి సైతం చెప్పారని, ఆ వ్యవహారంలో వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయమని కూడా అంటున్నారు. క్లీన్‌చిట్‌పై కూటమి నేతల్లో ఇలాంటి చర్చ జరుగుతుంటే…వైసీపీలో మరో రకంగా ఉందట. ఐఎఎస్ మీద చర్యలు నిలిపేశాక కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన తప్పుల గురించి గిరిషా ఈసీకి, ప్రభుత్వానికి సమాచారం ఇస్తారని అనుమానిస్తున్నట్టు తెలిసింది. ఆ డౌట్ వచ్చాక లోకల్ వైసీపీ నాయకుల్లో కాస్త అలజడి పెరిగిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కేసు నుంచి బయటపడ్డ అధికారి గిరిషా అసలు అప్పుడేం జరిగిందో… పూసగుచ్చినట్టు ప్రభుత్వానికి వివరాలు చెబితే… కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోన్న భయాలు వైసీపీలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముందు ముందు ఇందులో ఊహించని మలుపులు కూడా ఉండవచ్చంటున్నారు.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!