నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు.
రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎలాగైనా అధికారంలో రావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనే నినాదంతో దూసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య కూడా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇకపోతే ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న పులివెందుల సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు. ఇందుకు గాను పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం బాధ్యతలను జగన్…
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.