YS Avinash Reddy: న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. వైఎస్ వివేకా కేసులో అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. తనపై విపక్షాలు చేస్తున్నర ఆరోపణలపై స్పందించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. అనేక విషయాలపై స్పందించారు.. మా షర్మిల అక్క, సునితక్క ఎన్నికల ప్రచారాల్లో చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను అన్నారు. దస్తగిరి, సునితక్క లాలూచీ పడి నా పై ఆరోపణలు చేస్తున్నారు… వాచ్‌మెన్ రంగన్న నలుగురు వ్యక్తుల పేర్లు చెప్పాడు .. నెల రోజులు అయినా సీబీఐ వాళ్లు అరెస్టు చేయలేదు.. దస్తగిరి యాంటీస్పెక్టర్ బెయిల్ కు సీబీఐ, సునితక్క అడ్డుకోరు.. డబ్బులు ఇస్తాం, బెయిల్ ఇస్తాం అంటే ఎవరిపైన అయినా ఆరోపిస్తారు అంటూ మండిపడ్డారు. జులై 2020లో సునితక్క వాగ్మూలం ఇచ్చినప్పుడు నా భర్త తన ఫోన్ లో లెటర్ చూపించాడని చెప్పింది.. ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు. ఆ లెటర్ గురించి ఏమి తెలియదని చెబుతుంది.. సీబీఐ ముందు నెల తిరగకుంనే సునితక్క మాట మార్చింది.. సంఘటన జరిగిన వారం లోపు ప్రెస్ మీట్ పెట్టి సునితక్క ఏమి చెప్పింది.. నాన్న చనిపోయిన ముందు రోజు ఎన్నికల ప్రచారంలో అవినాష్ ను గెలిపించాలని కోరారు అని సునితక్క చెప్పిందని గుర్తుచేశారు.
మే 2023 లో నాకు బెయిల్ వచ్చిన తరువాత సీబీఐ వద్దకు వెళ్లి, మే 31, 2023న సజ్జల చెప్పమంటే చెప్పానని అంటోంది అంటూ సునితపై ఫైర్ అయ్యారు అవినాష్‌రెడ్డి.. చంద్రబాబు నాయుడు చెప్పమంటే అలా చెబుతోంది సునితక్క అని ఆరోపించారు. శివ ప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు.. తను నాకు ఫోన్ చేస్తాడని ముందే నేను ఎలా ఊహించగలుగు తాను.. సీబీఐ చేస్తున్నది గుడ్డి ఆరోపణ అన్నారు. సీబీఐ చేస్తున్నది తప్పుడు విచారణ.. లోకల్ సీఐకి నేనే ఫోన్ చేసి చెప్పినా.. లెటర్ ఉంటే పోలీసులకు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి కి లేదా..? అని నిలదీశారు. ఎందుకు లెటర్ దాచి పెట్టారు… ఎర్ర గంగిరెడ్డి కి ఫోన్ చేసిన వ్యక్తి నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఏ నుంచి ఏ 4 వరకు ఉన్న నిందితులు వివేకా పెద్డనాన్నకు సన్నిహితులే అన్నారు. పండింటి రాజశేఖర్ ఇచ్చిన వాగ్మూలం చూసావా అక్క. మీ తండ్రి ని నిరాదరణకు గురి చేసింది ఎవరు.. వ్యాపారంలో వచ్చే లాభానికి రెండవ భార్యకు ఇస్తాడాని నెట్టి వేసింది మీరు కాదా..? అని నిలదీశారు.
వజ్రాలు, సైట్స్ లలో వచ్చే లాభాల ను వారికి ఇవ్వడని వివేకాను ఇబ్బంది పెట్టింది ఎవరు…? అని ప్రశ్నించారు అవినాష్‌రెడ్డి.. గూగుల్ టెక్ ఓవర్ పై గూగులే నిర్ధారణ చేయలేక పోతోంది.. దస్తగిరి ఎవరో చెప్పిన రూమర్లను నమ్మి ఆరోపణలు చేస్తున్నారు.. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది.. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. ఈ కేసులు వల్ల నా కుటుంబం ఎంత ఇబ్బంది పడుతోందో తెలుసా అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ పాపం తెలియని నా కుటుంబం మానసిక క్షోభను అనుభవిస్తోంది.. సునితక్క, ఆమె భర్త తమ వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇవ్వడంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. తమ బాధ్యతలను ఎందుకు విస్మరించారు.. అవినాష్ గుండెపోటు అన్నాడని కొందరిపై మా అక్క వత్తిడి తెచ్చింది.. గుండె పోటుతో చనిపోయాడని, ఆ నాడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు.. మరి ఆయనకు ఎవరు ఆ మాట చెప్పారో అక్కకు తెలియదా..? అని ప్రశ్నించారు. వివేకం సార్ నాకోసం పని చేశారు… ఎంపీ టిక్కెట్ కోసం ఇలా జరిగింది అనడం అవివేకం. రామ, లక్ష్మణులుగా ఉన్న నా కొడుకులను గెలిపించాలని హత్య కు ముందు వారం వేంపల్లి సభలో వివేకం సార్ మాట్లాడ లేదా..? అని ప్రశ్నించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.