Thota Trimurthulu on Shiromundanam Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ముద్దాయిలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్షలు ఖరారు చేసిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. శిరోముండనం కేసులో శిక్ష ఖరారైన తర్వాత.. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ తర్వాత ముద్దాయిలు అందరికీ బెయిల్ ఇచ్చింది కోర్టు.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత.. ఈ కేసుపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని భావిస్తున్నాను అన్నారు..
Read Also: Chhattisgarh Encounter: కంకేర్‌లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోలు హతం..!
శిరోముండనం కేసును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన నా ప్రత్యర్థులకు, టీడీపీ నేతలకు ఇవాళ వచ్చిన తీర్పు రుచించదు అని పేర్కొన్నారు త్రిమూర్తులు.. నాకు సంబంధం లేని కేసును ఇంతకాలం ఎదుర్కొన్నాను… కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తాను అన్నారు. హైకోర్టులో నాకు 100 శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు. కేసు కోసమో పార్టీలు మారుతున్నాను అనే రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు నిరాశ ఎదురైందని సెటైర్లు వేశారు. ప్రభుత్వమే కేసులు మాఫీ చేయగలిగితే చంద్రబాబుపై వున్న కేసులు సంగతేంటి..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.. రాజకీయాలకు కేసుకు సంబంధం లేదన్నారు. ఇక నుంచి ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడతాయో చూస్తాను అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.