రాజకీయ రంగ ప్రవేశం అంతా ఆశామాషీ విషయం కాదనేది అందరికీ తెలుసు. తలలు పండిన మేధావులే ఒక్కోసారి రాజకీయంలో తడబడటం సహజం. కానీ.. ఓ సాధారణ మహిళ.. ఆడపిల్లకు చదువెందుకు? ఇంటిపని చేసుకుంటే చాలనే భావజాలం బలంగా ఉన్న రోజుల్లోనే సమాజాన్ని ఆశ్చర్యపరిచే విధంగా డిగ్రీ విద్యను అభ్యసించింది. మారుమూల జిల్లా… వెనుకపడిన ప్రాంతంగా ముద్ర పడిన ప్రాంతంలో ఉన్న ఆమెకు డిగ్రీ పూర్తి అయ్యాక వివాహమైంది. అయినప్పటికీ.. విద్యావకాశాలు అతి తక్కువగా ఉన్నా.. ఆ మహిళ…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.