Nagari: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు.. కొత్త వ్యూహాలతో విస్తృతంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో.. వైసీపీ కీలక నేత, మంత్రి ఆర్కే రోజాకు షాక్ తగిలింది.. నగరిలో మంత్రి రోజాకు ఝలక్ ఇచ్చింది వ్యతిరేకవర్గం.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరారు మంత్రి రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుత్తూరులో కీలమైన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ములు అలియాస్ ఎలుమలై.. ఆయనతో పాటు డీసీసీబీ జిల్లా మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి యాదవ్, బిల్డర్ వెంకటముని తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు.. రోజాకు మద్దతు ఇవ్వమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు చెప్పినా.. స్థానికంగా పట్టించుకోకపోవడంతో.. పార్టీకి నగరి వైసీపీ కీలక నేతలు దూరమయ్యారనే చర్చ సాగుతోంది.. ఇక, గత స్థానిక సంస్ధల ఎన్నికల్లో పుత్తూరులో మంత్రి రోజాపైనే అమ్ముల్లు అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.
Read Also: Raghunandhan Rao: రేవంత్ రెడ్డికి తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు.. ఆయన మాటల్లో నిజాల్లేవ్..