Sajjala Ramakrishna Reddy: మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.. తాడేపల్లిలో మేకా వెంకటరెడ్డి ఇంటిని సందర్శించి.. వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ హింసాత్మక చర్యలకు ఉపక్రమించింది. మనుషుల ప్రాణాలు తీసేనేదుకు సైతం వెనకాడటం లేదు. టీడీపీ గూండాలు మా వాళ్లని రెచ్చగొట్టి మరి బైక్ తో వచ్చి వేగంగా ఢీ కొట్టారు. ప్రాణాలు తియ్యాలన్న ఉద్దేశంతో ఈ రకంగా దాడులకు దిగుతున్నారు. మేం సంయమనంతో, నిగ్రహంతో ఉన్నా టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Suspended: టీఐఎస్ఎస్ దళిత పీహెచ్‌డీ విద్యార్థిపై రెండేళ్ల పాటు వేటు.. కారణమిదే!
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అని హెచ్చరించారు సజ్జల.. దాడులు వాళ్లే చేస్తున్నారు.. బాధితులు వాళ్లే అని మళ్లీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు. మా వాళ్లు నిగ్రహంతో ఉన్నారు.. కాబట్టే టీడీపీ నేతలు ఇంకా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు. శవాలపై పేలాలు ఎరుకోవాలని టీడీపీ చూస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి మర్చిపోక ముందే మరో హత్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని టీడీపీ నేతలకు చెప్తున్నాం. సిగ్గు లేకుండా జరిగిన దాడులను వెనకేసుకొచ్చి డ్రామా అని టీడీపీ నేతలు అంటున్నారు.. కానీ, రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందన్నారు. మేం రెచ్చిపోతే అది ఎక్కడికో దారి తీస్తుందని టీడీపీని హెచ్చరించారు.. మేం అంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించవద్దు.. మేం దణ్ణం పెట్టి చెప్తున్నాం హత్యలు, దాడులకు దూరంగా ఉండాలన్నారు. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులు చేయాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ నేతలు అంతా సమయమనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!