విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, రాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఈ కేసులు ఛేదించడంపై పోలీసులకు సవాల్‌గా మారింది.. అయినా వెనక్కి తగ్గకుండా.. కేసు దర్యాప్తు చేపట్టిన బెజవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.. దాడికి పాల్పడిన వారిని, ఇక వారికి సహకరించిన వారిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి…
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.
శిరోముండనం కేసును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన నా ప్రత్యర్థులకు, టీడీపీ నేతలకు ఇవాళ వచ్చిన తీర్పు రుచించదు అని పేర్కొన్నారు త్రిమూర్తులు.. నాకు సంబంధం లేని కేసును ఇంతకాలం ఎదుర్కొన్నాను... కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తాను అన్నారు. హైకోర్టులో నాకు 100 శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాని తెలిపారు.