CM YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను సీఎంకు నివేదించారు కార్మిక సంఘాల నాయకులు. ఇక, ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్పీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.. ఈ సమస్యపైమొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది.. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశామని గుర్తుచేశారు.
Read Also: KCR: రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సుయాత్ర..
స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం అన్నారు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం .. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి.. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందని దుయ్యబట్టారు. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు సీఎం.. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం.. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైయస్సార్సీపీకే ఉంది.. పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు సీఎం వైఎస్ జగన్.