Vijayasai Reddy: నెల్లూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. నెల్లూరు నేలతల్లి రుణాన్ని తీర్పు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారని.. నెల్లూరు లోక్‌సభ నుంచి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు.. బెజవాడ రామచంద్రా రెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు లోక్‌సభ సభ్యుల జాబితాలో నా పేరు కూడా చేరడానికి నెల్లూరు ప్రజలు సువర్ణావకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు.
Read Also: Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయం
ఇక, నెల్లూరు ఎంపీలుగా పని చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఆదాల ప్రభాకర్ రెడ్డిల అడుగుజాడల్లో నడుస్తాను అన్నారు సాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడిగా 8 ఏళ్లుగా పని చేస్తున్నా.. జూన్ నుంచి నెల్లూరు లోక్‌సభ కొత్త సభ్యుడిగా పార్లమెంట్లోకి ప్రవేశిస్తాననే ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ఆడిటర్ గా మొదలైన నా ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కలిగిందన్నారు. నెల్లూరు ఎంపీ విజయ సాయి రెడ్డి అనే ప్రజాస్వామిక హోదా కంటే గొప్ప విషయం ఏదీ కాదు అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలగడం సంతోషంగా ఉంది.. ప్రజలంతా నాకు ఆశీర్వాదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.