ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.
మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నా రాంబాబు సతీమణి దుర్గా కుమారి అభ్యర్థించారు.