Lakshmi Parvathi: నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. కుప్పం నియోజకవర్గంలో పర్యటించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ ఆమె.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలంటూ పిలుపునిచ్చారు. హిందూపురం అభివృద్ధి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు.. అభివృద్ధి కోసం వైసీపీకీ ఓటెయ్యండి అని విజ్ఞప్తి చేశారు. ఇక, తన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కి అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఏరకంగా అండగా ఉంటారు..? అని ప్రశ్నిస్తూ హాట్ కామెంట్లు చేశారు.. గతంలో బాలకృష్ణ హత్య కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాను స్వయంగా కలిసి.. కేసు లేకుండా చేయించాను. అందుకు బాలకృష్ణనే సాక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.. హిందూపురం అభివృద్ధి జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి.. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓడిపోవాలి అని పిలుపునిచ్చారు లక్ష్మీపార్వతి. కాగా, హిందూపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తూ.. బాలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే.
Read Also: Dharmapuri Arvind: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదు..