రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు
ఏపీ గవర్నర్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన..…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు... గొడవలను అరికట్టలేకపోతే... బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు.