డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు విలువైన 25 వేల కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతి పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని పొలిటికల్ డిమాండ్ ఊపందుకుంది. 2024 మార్చి 19న సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజులు ముందు... ఏపీ రాజకీయాలను దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ.. సీబీఐ బాంబు పేల్చింది.…
శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్.. ఇప్పటికే ఆమె మంత్రి ఫరూఖ్ తో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ భేటీలో ఆమె.. పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చిందని.. త్వరలో తెలుగుదేశం పార్టీలో జాకియా ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.
ఇండియా కూటమిలో చేరతారా? అనే అంశంపై స్పందించిన వైఎస్ జగన్.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫొటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశాం.. అవి చూసిన తర్వాత గళం విప్పాలని కోరాం.. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వచ్చాయి.. కానీ, కాంగ్రెస్ పార్టీ రాలేదు అనే విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..