గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారని ఫైర్ అయ్యారు
Home Minister Anitha: ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నాపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయి.. కానీ వైసీపీకి అబద్ధపు, ప్రచారాలు నంగనాచి కబుర్లు చెప్పడమే సిద్దాంతం.. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ అని ఆరోపించారు.
YS Jagan Protest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు.