MLC Duvvada Srinivas Episode: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది. గత రెండు రోజులుగా దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు తమ తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బడుతు రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు , కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది. దువ్వాడకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రిని చూసేందుకు హైందవి, నవీన గురువారం సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు. ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో అర్దరాత్రి గంటల వరకు ఇంటి బయటే ఉండిపోయారు. గేటు కొట్టినా, కారు హారన్ మోగించినా దువ్వాడ స్పందించలేదు. ఇంటిలో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్తెలు. లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. తన భర్త తండ్రి చనిపోయినా పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు. ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపించినా స్పందించడం లేదన్నారు. లోపలి వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు. వేరొక మహిళ ట్రాప్ లో తమ భర్త ఉండటంతోనే ఈ పరిస్దితి దాపురించిందంటున్నారు దువ్వాడ భార్య వాణి , కుమార్తెలు హైందవి, నవీన .
Read Also: Rakhi Festival: ఆడపడుచులకు ఆర్టీసీ బంపరాఫర్.. రాఖీల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
అయితే, దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. గత ఏడాదిన్నరగా దువ్వాడ వేరుగా ఉండున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది. ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు. వైసీపీ పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, తమ్మినేని సీతారం, సీదిరి అప్పలరాజు అందర్నీ కూర్చోబెట్టి సర్ధిచెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీఇచ్చారు. పొలిటికల్ ఇష్యూ అలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండటాన్ని జీర్ణించుకొలేఖ పొతున్మామంటూ ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ కారణాలతో దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కుమార్తెలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు. ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు. ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చగా మారింది. రెండురోజులుగా దువ్వాడ ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి సాగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిలో మరో మహిళతో కలసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీను-వాణికి హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శ్రీను మరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు ఆందోళన నిర్వహించారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చుని ఉంటున్నారు బయటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. తాజాగా అవి బయటపడ్డాయి. మ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని తమ కుటుంబంలో కావాలనే దివ్వల మాధురి అనే మహిళ చిచ్చు బెట్టిందని అరోపిస్తున్నారు.
Read Also: Astrology: ఆగస్టు 10, శనివారం దినఫలాలు
అయితే, 2022లో దువ్వాడ వాణినే తనను పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి వెల్లడించారు. తన పై లేనిపోని నిందలు వేసి రోడ్డుపై నిలబెట్టింది దువ్వాడ వాణి అంటూ మండిపడ్డారు దివ్వల మాధురి.. రాజకీయంగా తనకి టిక్కెట్ కోసమే వాణి ప్రయత్నిస్తుందన్న ఆమె.. నా లైఫ్‌కి సెక్యూరిటీ ఎవరు అంటూ ప్రశ్నించారు.. తానుఇంకా దువ్వాడ శ్రీను పెళ్లి చేసుకోలేదని.. తనకు దువ్వాడ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటుంది.. సూసైడ్ చేసుకోవాల్సిన సమయంలో నన్ను ఆదరించి కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను ఉన్నారన్నారామె. నా మీద పడ్డ మచ్చ ఎప్పటికి పోదు.. నేను దువ్వాడ శ్రీను తోనే ఉంటానని స్పష్టం చేశారు.. మాఇద్దరికి.. డైవర్స్ అయితే.. ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో ఆలోచిద్దాంమంటుంది.
Read Also: Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
ఇక, దివ్వల మాధురి ప్రెస్ మీట్ తర్వాత మరోసారి దువ్వాడ నుతన ఇంటికి వెల్లారు. భార్య వాణి , కుమార్తె హైందవి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిలోని ప్రవేశించిన భార్యా వాణి, కుమార్తె హైందవి.. గత రెండు రోజులుగా ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నించిన తలుపులు తీయని దువ్వాడ శ్రీనివాస్.. తలుపులు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించారు తల్లి, కుమార్తెలు. దీనిని తట్టుకోలేక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. ఆయనను కలిసేందుకు వచ్చిన భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవిలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. తీవ్రమైన పదజాలంతో ఆయన భార్య, కుమార్తెను తిడుతూ తన ఇంటి వద్ద నుండి వెళ్లియిపోవాలని దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని మోహరించిన టెక్కలి పోలీసులు.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి సర్దిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు..