Minister Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు.. ఆయన కామెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’గా పేర్కొన్న ఆయన.. రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.. మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారన్న ఆయన.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది… అంతెందుకు ఆయనకు కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు.. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ డెలివరి చేసినప్పుడు వైఎస్ జగన్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదు? అని నిలదీశారు.. సొంత బాబాయి గొడ్డలి వేటు పడి చనిపోతే ఆయన కుమార్తె అయినా సునీత పక్షాన కాకుండా ముద్దాయిల పక్షాన ఎందుకు ఉన్నావు జగన్ రెడ్డి? అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ఆరోపిస్తోన్న విషయం విదితమే.. హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శిస్తూ వస్తున్న ఆయన.. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అందరినీ బెదిరిస్తున్నారని వ్యాఖ్యానిస్తోన్న విషయం విదితమే..
Read Also: Tihar Prison jailer: తీహార్ జైలర్ ఓవరాక్షన్.. బర్త్ డే పార్టీలో తుపాకీతో డ్యాన్స్