YS Jagan: హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు.. హత్య కేసుల్లో చిన్నచిన్నవాళ్లను ఇరికిస్తున్నారని మండిపడ్డారు.. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రాయడం లేదు..? సుబ్బారాయుడును చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డ్ చెక్ చేస్తే ఎవరు చేయించారో తడలుస్తుంది కదా? అని ప్రశ్నించారు..
ఇక, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరులో విజయోత్సవసభలో ఏమి మాట్లాడారో చూడండి అంటూ.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రసంగం ఆడియో వినిపించారు వైఎస్ జగన్.. మండలానికి ఇద్దరిని చంపండి, పోలీసులను, కేసులను నేను చూసుకుంటానని అంటారా..? అంటూ ఫైర్ అయ్యారు.. ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టి దారుణంగా మాట్లాడుతుంటే కేసులు ఎందుకు పెట్టరు? అని నిలదీశారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సి ఉంది అన్నారు.. జగన్ ఉంటే విద్య దీవెన, వసతి దీవెన వచ్చేవి.. మహిళలకు సున్నా వడ్డీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు.. ఎవరు ప్రశ్నించ కూడదని ఏపీలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నాడు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామాలలో స్థానిక నేతలు ఆధిపత్యం కోసం దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. లా అండ్ ఆర్డర్‌ని నాశనం చేశారని మండిపడ్డారు.. సీతారాంపురంలో ఏజెంట్లుగా కూర్చున్నారని సుబ్బారాయుడు మరి కొందరిని చంపాలని చూసారు.. సుబ్బరాయుడును చంపేశారు.. అసలు సీతారాంపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Shaurya Doval: పాకిస్థాన్ తో భారత్ కు ముప్పు..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బయటి నుంచి వచ్చిన వాళ్లు కూడా రాడ్లు, కర్రలు, కత్తులు, తుపాకులతో ఏకమవుతుంటే నారపరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు అని తెలిపారు వైఎస్ జగన్.. గ్రామంలో ఏదో జరుగబోతుందని, పోలీలనురమ్మని రాత్రి 9కి ఫోన్ చేస్తే ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు.. సీఐ, డీఎస్పీలకు ఫోన్లు చేశారు.. అయితే బందోబస్తు మాత్రం తీసుకు రాలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షకాపాత్ర వహించారని ఆరోపించారు. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉన్నా, అక్కడ ఎస్పీ వున్నా ఎవరూ రాలేదు.. 10 నిముషాలు ప్రయాణం చేస్తే సీతారాంపురం రావచ్చు.. పోలీసులను పంపి ఉంటే ఈ హత్య జరిగేది కాదు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు.. అదనపు బలగాలు రాలేదు.. ఎమ్మెల్యే ప్రోద్బలం, లోకేష్ , చంద్రబాబు అండదండలతో పోలీసులు ఇక్కడి రాకుండా చేశారు.. ఎస్ఐ, కానిస్టేబుళ్ల సమక్షంలో సుబ్బరాయుడును హత్య చేశారు అంటూ మండిపడ్డారు.. హత్య చేశారని చెప్పినా నిందితులను పట్టుకోలేదు.. నారపరెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి కూడా ఫోన్ చేసి చెప్పినా పోలీసులను పంపలేదు.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నిస్తే, ఎస్పీకి ఫోన్ చేస్తే నంద్యాల త్రి టౌన్ పీఎస్ లో అప్పగించాలని చెప్పారు.. సీతారాంపురం కి అదనపు బలగాలు ఎందుకు రాలేదు..? హత్య చేసి కొందరిపై దాడి చేసినా ఎందుకు పోలీసులు రాలేదు.. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్.