Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
- ఈరోజు సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్
- మార్చి 15 లేదా 16న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
- పవన్ కళ్యాణ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మూవీ మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేయగా, ఇప్పుడు చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 14న, అనగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవర్ స్టార్ కూల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 15న హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఒకవేళ ఆరోజు కుదరకపోతే మార్చి 16న మాత్రం పక్కా అంటున్నారు. ఎందుకంటే.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాద్యతలు నిర్వరిస్తున్న పవన్ డేట్‌ను బట్టి ఈ ఈవెంట్ ఉండనుంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ స్పీచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా.. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబో వస్తుండటంతో, థియేటర్ల వద్ద మరోసారి పూనకాలు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేస్తున్నాడు.
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!