అనంతపురం జిల్లాలో రథం దహనం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు అందజేయగా.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు.
RK Roja Warns Youtube Channel Owners running on Her name: ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ…
తిరుమల లడ్డూ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పులు చేసినవారు ఎవరు అయినా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. వైఎస్ జగన్ మొదటి నుండి తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తువచ్చారని ఆరోపించారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు... అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు..
Anil Kumar Yadav: నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.
Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
JanaSena: ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు.