Mithun Reddy: వచ్చేది జగనన్న ప్రభుత్వమే.. దానికోసం ఎన్ని కేసులైనా.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉంటే మా మీద కేసులు అనేవి.. వేధించడం అన్నది మామూలే అన్నారు.. ఇవన్నీ ఒక్కరోజులో వీగిపోయే కేసులే అని కొట్టిపారేశారు.. అయితే, ఇలాంటి కేసులకు భయపడేదే…
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు.. రెండున్నర నెలల ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి…
Minister RamPrasad Reddy: వైసీపీ డిజిటల్ బుక్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సానుభూతిపరులపై దాడులు చేసి కష్టపెట్టారో వారి కోసం తమ వద్ద రెడ్ బుక్ ఉందని నాడు పాదయాత్రలో మా యువ నాయకుడు నారా లోకేష్ చెప్పారు.. రెడ్ బుక్‌లో ఎవరికైతే చోటు దక్కుతుందో వారందరికీ శిక్ష వేస్తామన్నారు..? కానీ, తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు…
వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా ఫిర్యాదు అందింది. విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత…
Gudivada Amarnath: కక్ష పూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్,…
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది.. మండలి చైర్మన్ కు ప్రోటోకాల్ విషయంలో జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతించారు.. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన మండలి చైర్మన్ మోషేర్‌రాజు.. వ్యక్తులకు, వ్యవస్థలకు, అధికారులకు…