Minister Satya kumar: ఉద్దానం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావు.. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టాడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారు.. మెడికల్ కళాశాలల నిర్మాణం పీపీపీ మోడల్ లోనే జరుగుతుంది.. గత ఐదేళ్లల్లో జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదు.. ఐదు వేలకోట్లు పనులకు ఐదు వందల కోట్ల పనులు చేశారు.. పులివెందులలో మాత్రమే జగన్ మెడికల్ కళాశాలను పూర్తి చేశారు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం లొ పది మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేస్తామన్నారు. జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదు.. ఆయన వచ్చి కట్టే వరకు విద్యార్థులు నష్టపోయారు అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Read Also: Kakinada: 8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లిన టీడీపీ నేత.. కౌన్సిలర్నంటూ బెదిరింపులు..
అయినా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా.. వైసీపీ వచ్చేది లేది చచ్చేది లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. 10 మెడికల్ కళాశాలు పూర్తి అయితే 70 శాతం పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది.. యాజమాన్య హక్కులు, నిర్వహణ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి.. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే నేడు పీపీపీ విధానంలో మేము నిర్మిస్తున్నాం.. వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణం చేయకుండా గాడిదలను కాశారా అని ప్రశ్నించారు. ఇంకా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తున్నారని సత్యకుమార్ అడిగారు.