TDP: ఏపీ సీఎం చంద్రబాబు అటు మంత్రులకు ఇటు నేతలకు వైసీపీ ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్తున్నారు.. కేబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి మంత్రులకు రకరకాల సూచనలు ఇస్తున్నారు… వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని అదే విధంగా వైసీపీపై ధీటుగా స్పందించట్లేదని… ఇలా చేయకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. దీంతోపాటు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నారు..
Read Also: AA22 x A6 : అట్లీ, అల్లు అర్జున్‌ల మాయలో పడిపోయిన రణ్‌వీర్ సింగ్!
పార్టీ నేతలు కూడా సరిగా స్పందించట్లేదని అభిప్రాయంలో సీఎం చంద్రబాబు ఉన్నారు.. వైసీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహంపై దాడులు చేసినా వాళ్లని కాపాడుకునే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందని… నకిలీ మద్యం వ్యవహారంలో కూడా వైసీపీ అప్పర్ హాండ్ లో ఉందనే అభిప్రాయం సీఎం నేతల దగ్గర చెప్పారట. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా వైసీపీ చేస్తున్న విమర్శలకు సరిగా నేతలు స్పందించట్లేదని టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు… పార్టీ నేతలు తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని.. వైసీపీ చేసే విమర్శలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని… నేతలకు సూచించారు. చంద్రబాబు.. వైసీపీ చేసే విమర్శలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని సీఎం చంద్రబాబు తన మనసులో మాటను పార్టీ నేతల దగ్గర బయటపెట్టారు..
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా టిడిపిని కొంతవరకు ఇరుకున పెట్టె పరిస్థితి కనిపిస్తోంది.. నకిలీ మద్యం కావచ్చు లేకపోతే మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు టిడిపి తో పాటు కూటమి నేతలు కూడా ఇరుకున పడ్డారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది… ఇప్పటివరకు గత ప్రభుత్వం లో లిక్కర్ కుంభకోణం. నకిలీ మద్యానికి సంబంధించి కూటమి చాలా హడావిడి చేసింది.. కానీ సడన్ గా నకిలీ మద్యం అంశం. ఈ ప్రభుత్వం లోనే వచ్చి పడింది…దీంతో. కూటమి నేతలు. దిక్కు తోచని స్థితి లో పడ్డారనే అభిప్రాయం ఉంది…రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంశం. హాట్ టాపిక్ అయింది… .దీంతో వైసిపి ఒక పక్క రెచ్చిపోయి మాట్లాడుతుంటే టీడీపీ నేతలు సరిగ్గా స్పందించడం లేదనే అభిప్రాయం సీఎం చంద్రబాబు నేతల దగ్గర వ్యక్తం చేశారు..
రైతాంగ సమస్యలు.. మెడికల్ కాలేజీలు.. నకిలీ మద్యం… ఇలా వివిధ అంశాల్లో వైసీపీ అప్పర్ హాండ్ అయిందనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది.. చంద్రబాబు కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే నేతలు స్పందించాలని చెప్పారు.. పార్టీ నేతలు.. ఎవరికి తోచిన రీతిలో వారుండడం మంచిది కాదనే అభిప్రాయం కూడా సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని.. చంద్రబాబు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక నుంచి పార్టీ నేతలు అంతా యాక్టివ్ గా ఉండాలని.. జిల్లాల్లో కానీ.. అమరావతిలో గానీ స్పందించేటప్పుడు డేటా తీసుకొని స్పందించాలని.. వైసీపీకి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వకూడదని కూడా సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు…