Nakka Anandababu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఇరు పార్టీల నేతలు ఎక్కడో చోట విమర్శలు చేసుకుంటూనే వున్నారు. దళిత వర్గాలపై జగన్ పార్టీది కపట ప్రేమ అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడింది.. అది దొంగ సస్పెన్షన్. గడప గడపకు…
ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు టీడీపీలో జోష్ నింపింది. అయితే పార్టీలో అక్కడక్కడ ధిక్కారంతో వున్న నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల…
తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో వాతావరణం మరింతగా వేడెక్కింది. బస్సు యాత్ర పై చంద్రబాబు విషం కక్కుతున్నాడు. ప్రజలు రాజకీయ సమాధి కడతారు. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబు కు సిగ్గు ఉండాలి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, మహానాడు తీరుపై నిప్పులు…
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత బాబు ను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్,అసెంబ్లీ సెక్రటరీ కి సమాచారం ఇచ్చారు కాకినాడ పోలీసులు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పోలీసు కస్టడీలో ఉన్నారని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు. పోలీస్ కష్టడీని నిర్థారించారు అడిషనల్ ఏస్పీ శ్రీనివాస్. అనంతబాబుని ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ విచారిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అత్యంత గోప్యంగా వుంచుతున్నారు.