ఏపీలో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. నెల్లూరులో వైసీపీ రాళ్ళ దాడిపై బీజేపీ సీరియస్ అయింది. బీజేపీ ఏపీ చీఫ్ ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. రాళ్ళ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. హిందూ సమాజం పట్ల నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవమానకరంగా వ్యవహరించారు. బీజేవైఎం కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుంటే.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Group-4 Jobs : గ్రూప్-4 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో కలిసి ముస్లిం టోపీ పెట్టుకుని ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాదయాత్ర ఎలా చేస్తారు..? అనిల్ కుమార్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు సమక్షంలో వైసీపీ నేతలు దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం అన్నారు సోము వీర్రాజు. అయ్యప్ప మాల వేసుకుని ముస్లిం లాగా తలపై టోపీ పెట్టుకుని మసీదు లోకి ఏ విధంగా వెళ్తారని వారంతా ప్రశ్నించారు.
అనిల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇస్కాన్ సిటీలోని మాజీ మంత్రి అనిల్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనిల్ తీరుని తప్పుబట్టారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
Read Also: Pawan Kalyan: 27న ఇప్పటం పర్యటనకు పవన్.. పోలీసుల యాక్షనేంటో?